Site icon NTV Telugu

Narendra Modi : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Modi

Modi

తెలంగాణ రాష్ట్ర పర్యటన రెండో విడత మంగళవారం ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌కు వెళ్లి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రధాన మంత్రి అమ్మవారికి పట్టు చీర , ఇతర నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) ను ప్రారంభించేందుకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన మోడీ, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అంకితం చేసి, బహిరంగ సభలో ప్రసంగించారు.

PM Modi: పాక్‌ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్‌ రెండోసారి బాధ్యతలు.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఆలయానికి ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి, నిర్ణీత మార్గంలో , ఆలయం సమీపంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్మవారి దర్శనం అనంతరం అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో సంగారెడ్డికి వెళ్లనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఆపై తెలంగాణ పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒరిస్సాకు బయలుదేరి వెళ్లనున్నారు.

Ambani’s Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసినా సినీ తారలు…

Exit mobile version