PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కోల్‌కతాలో నేడు జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వేదికపై ఉన్న ఓ 97 ఏళ్ల వృద్ధుడిని ప్రధాని మోడీ గమనించారు. నేరుగా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేశారు. అనంతరం ఆలింగనం చేసుకున్నారు. దీంతో ప్రధాని స్వయంగా కాళ్లు మొక్కిన ఆ వృద్ధుడు ఎవరు? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైంది. ఆయన ఎవరో కాదు.. బీజేపీ తొలి తరం నేతల్లో ఒకరైన సిలిగురికి చెందిన మఖన్ లాల్ సర్కార్. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి మఖన్ లాల్ అత్యంత సన్నిహితుడు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు, ఆయన చివరి యాత్రలోనూ సర్కార్ తోడుగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక దేశభక్తి గీతాన్ని పాడినందుకు ఢిల్లీ పోలీసులు సర్కార్‌ను అరెస్టు చేశారు. కోర్టులో క్షమాపణలు చెప్పమని జడ్జి కోరగా, “నేను ఏ తప్పూ చేయలేదు, కేవలం పాట మాత్రమే పాడాను” అని నిరాకరించారు. అప్పుడు జడ్జి ఆ పాటను మళ్లీ పాడమని కోరగా, ఆయన కోర్టులోనే ఆ పాట వినిపించారు. దాంతో ప్రభావితుడైన జడ్జి.. ఆయనకు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిచ్చి, ఇంటికి వెళ్ళడానికి 100 రూపాయలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారట.
Also Read
ఇక, 1952లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వెళ్లినప్పుడు, ఆయన వెంట ఉన్న అతికొద్ది మందిలో మఖన్ లాల్ ఒకరు. ఆ సమయంలోనే కశ్మీర్‌లో అరెస్టు చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత.. వెస్ట్ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాలకు కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టి, కేవలం ఏడాదిలోనే 10,000 మంది సభ్యులను పార్టీలో చేర్పించారు. సిలిగురి జిల్లా బీజేపీ మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 1981 నుంచి వరుసగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. సాధారణంగా పార్టీ నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండేళ్లకు మించి పదవిలో ఉండటం కష్టమైన ఆ రోజుల్లో, ఆయన ఏడేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉండటం ఒక రికార్డు. 97 ఏళ్ల వయసులోనూ జాతీయవాద భావజాలానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మఖన్ లాల్ సర్కార్‌కు ప్రధాని మోడీ అందించిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతతరం కార్యకర్తలకు పార్టీ ఇచ్చే విలువకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!