NTV Telugu Site icon

Narendra Modi : కాంగ్రెస్‌ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది

Pm Modi

Pm Modi

జహీరాబాద్‌లో నేడు బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారని, కాంగ్రెస్‌ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్‌ఎస్‌ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ లూటీ చేస్తుందని, కాళేశ్వరం ఫైల్స్ ఈ ప్రభుత్వం తోక్కిపెట్టుందన్నారు. తోడు దొంగలు ఒకరికొకరు కాపాడుకోవాలని చూసుకుంటున్నారని, రెండు పార్టీ కు వేర్వేరు కాదన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం పార్టీతో కాంగ్రెస్ అలయన్స్ ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.. కాంగ్రెస్ అన్నదాత లను మోసం చేస్తుందని, రైతు రుణ మాఫీ చేయలేదు .. 500 బోనస్ ఇవ్వడం లేదు… నోరు మెదపడం లేదన్నారు మోడీ.

అంతేకాకుండా..’బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలను కాంగ్రెస్ ఎప్పుడు ముందుకు రానియ్యలేదు. మహిళ సురక్ష మా అధిక ప్రాధాన్యత.. ఎంత పెద్దవారు అయిన ఉపేక్షించేది లేదు.. ఉరి శిక్ష విధించే విధంగా చట్టాలు తెచ్చాము. అయోధ్య లో రామ మందిరం మోడీ నిర్మించలేదు… మీరు వేసిన ఓటు నిర్మించింది. కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ ప్రాధాన్యత. ఓటు బ్యాంక్ కోసం హైదారాబాద్ లో రామ నవమి ఉత్సవాలు పై ఆంక్షలు విధిస్తారు… ఉమ్మడి ఏపీ లో కాంగ్రెస్ కు మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపి సీట్లు ఇస్తే. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లలో అన్యాయం చేసింది. ముస్లిం లకు రిజర్వేషన్ లు ఇచ్చింది.. సంతుష్టి కరణ కోసం ఉమ్మడి ఏపీ ప్రయోగశాల గా మార్చింది… ఇక్కడ లింగయత్, మరాఠీ లు బీసీ ల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్ ఓబీసీ ల్లో చేర్చలేదు… ముస్లిం లను మాత్రం రాత్రికి రాత్రే బీసీ ల్లో చేర్చింది. బంజారా సమాజం ను నేరస్తుల గా చూసింది కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌.

 

పొద్దున లేస్తే రాజ్యాంగం పై మాట్లాడే ఈ పార్టీలు మాదిగలకు ఏమీ చేసింది. మాదిగ సమాజం కోసం పోరాటం చేస్తా అన్నాను… వర్గీకరణ వారి హక్కు… రాజ్యాంగం లో రామాయణ, మహాభారత చిత్రాలు ఉన్నాయి.. కాంగ్రెస్ పార్టీ నే రాజ్యాంగం లో నీ చిత్రాలు తీసేసింది. మొదటి రోజు నుండే రాజ్యాంగం ను, అంబేద్కర్ ను అవమానించింది. యువరాజు (రాహుల్ గాంధీ) ముత్తాత, నానమ్మ, రాజ్యాంగాన్ని అవమానించారు. పాపాలు సామాన్య పాపాలు కావు. రాజ్యాంగం రక్షణ కోసం మీడియా , రాజకీయ పక్షాలు రోడ్ల పైకి వస్తె మద్దతు ఇచ్చింది పోరాటం చేసింది బీజేపీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే… మీడియా ముందు ఆ ప్రతులను చింపివేశారు యువరాజు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ లను అంబేద్కర్ వ్యతిరేకించారు.’ అని మోడీ విమర్శించారు.