Site icon NTV Telugu

PM Narendra Modi: దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారికి మోడీ, అమిత్ షా నివాళులు

Modi

Modi

దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆ సమయంలో లక్షలాదిమంది మృతి చెందారని, వారిని గుర్తుంచుకోవాల్సిన సమయమని ప్రధాని పేర్కొన్నారు. వలసబాట పట్టిన వారి కష్టాలను, పోరాటాన్ని ఈరోజు గుర్తుచేస్తోందని ప్రధాని సూచించారు. కాగా, ఆగస్ట్ 14ను దేశ విభజన గాయాల స్మారక దినంగా పాటిస్తామని మోడీ 2021లో ప్రకటించారు.

Read Also: Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్స్..!

మరోవైపు అమిత్ షా మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే చీకటి అధ్యాయమని ఆయన అన్నారు. ఇందుకు మన దేశం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 1947 నాటి భయానక అనుభవాలు ఎంతోమందిని వెంటాడుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మతప్రాతిపదికన దేశ విభజన సమయంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారని అమిత్ షా తెలిపారు. అనంతరం.. హర్ గర్ తిరంగా పేరుతో కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు.

Read Also: Uttar Pradesh: భార్య చేసిన కూర నచ్చలేదని చంపేసిన భర్త

మరోవైపు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

Exit mobile version