NTV Telugu Site icon

Cabinet Meeting: నేటి సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం

Modi

Modi

Modi 3.0 Cabinet: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి మోడీ 3.0 సర్కార్ కొలువుదీరింది. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రెండో ప్రధానమంత్రిగా మోడీ రికార్ట్ సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా పని చేసిన చరిత్ర కేవలం పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకే ఉంది. ఇప్పుడు మోడీ ఆ రికార్డును సమం చేసేశాడు.

Read Also: Odisha : ఒడిశా సీఎంను సెలక్ట్ చేయనున్న రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌

ఇక, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోడీ 3.0 సర్కార్ లో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా.. వీరికి తొందరలోనే శాఖలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ( సోమవారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరుగనుంది.

Read Also: Monday Stotram: జ్యేష్ఠ సోమవారం ఈ స్తోత్రాలు వింటే సకల సౌభాగ్యాలు

కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణం చేశారు.