NTV Telugu Site icon

Vizag Drugs Case: డ్రగ్స్ కంటైనర్ కేసు.. కీలకంగా మారిన నార్కోటిక్స్ ల్యాబ్ సర్టిఫికెట్

Drugs

Drugs

Vizag Drugs Case: ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్‌ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్‌ నుంచి విశాఖ చేరిన ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్‌ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు సీబీఐ 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌ను కొనసాగించింది. బ్రెజిల్‌ నుంచి విశాఖకు నంబరు కంటైనర్‌ వస్తోందని, అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నాయని.. ఈ నెల 18న ఇంటర్‌పోల్‌ నుంచి ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి మెయిల్‌ అందింది. దాన్ని పట్టుకుని తనిఖీ చేయాలని అందులో సూచించింది. ఆ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో సీబీఐ ఫిర్యాదును రిజిస్టర్​ చేసింది. సీబీఐ ఎస్పీ గౌరవ్‌మిట్టల్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

Read Also: Visakha Drugs Case: విశాఖ డ్రగ్స్‌ కేసులో సంధ్య ఆక్వా చుట్టూ బిగుస్తున్న వచ్చు

సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులకు తాము ఎందుకొచ్చామో వివరించి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ప్రారంభించాయి. కంటెయినర్‌లోని ఒక్కో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ తీస్తుంటే లేత పసుపు రంగు పొడి బైటపడింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నుంచి తీసుకొచ్చిన ‘నార్కోటిక్‌ డ్రగ్స్‌ డిటెక్షన్‌’ కిట్‌ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్ కంటైనర్ కేసులో నార్కోటిక్స్ ల్యాబ్ సర్టిఫికెట్ కీలకంగా మారింది. మరో రెండు రోజుల్లో నివేదిక వస్తుందని సీబీఐ అంచనా వేసింది. అనుమానిత డ్రగ్స్ మిక్సింగ్ నిర్ధారణ జరిగితే కీలక చర్యలకు సీబీఐ ఉపక్రమించనుంది. న్యాయమూర్తి సమక్షంలో శాంపిల్స్‌ను సేకరించిన తర్వాత ఆ ప్యాకెట్లను రీప్యాక్‌ చేసిన వాటిని కంటెయినర్‌లో అధికారులు సీల్ వేశారు. కంటైనర్ టెర్మినల్‌లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరచి అల్ వెదర్ ప్రూఫ్ జోన్‌లో సీబీఐ భద్ర పరిచింది. డ్రగ్స్ అవశేషాలు వాతావరణ ప్రభావానికి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

బస్సును కంపెనీకి అప్పగించిన పోలీసులు
విశాఖ డ్రగ్స్‌ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమలకు సంబంధం ఉందని నేపథ్యంలో మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో నాలుగు రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిందే.. అంతా సజావుగా ఉంది అనుకునే సమయంలో కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్‌ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కొన్ని రోజులుగా నిలిపివేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు ఉన్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూలపేటలో సంధ్య అక్వాకు చెందిన బస్సును కంపెనీ సిబ్బందికే పోలీసులు అప్పగించడం గమనార్హం. మొదటి సీబిఐ అధికారులకు అప్పగిస్తామని చెప్పిన పోలీసులు.. అలా చేయలేదు. సీబీఐకి పోలీసులు ఏం సమాధానం చెప్తారు అనే విషయంలో క్లారిటీ లేదు.