Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Narco Test Of Aaftab Poonawala Completed In Shraddha Walker Case

Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి

Published Date :December 1, 2022 , 3:00 pm
By Mahesh Jakki
Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shraddha Walker Case: తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. ఢిల్లీ కోర్టు విశ్లేషణకు అనుమతి ఇవ్వడంతో అఫ్తాబ్‌ను నార్కో పరీక్ష కోసం ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ పోలీసులు రోహిణిలో గల బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేముందు అఫ్తాబ్‌కు రక్తపోటు, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలను తనిఖీ చేసే సాధారణ పరీక్షలను నిర్వహించారు. అనంతరం అతను నార్కో పరీక్షకు అంగీకరిస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్‌కు అనస్థీషియా ఇచ్చారు. అనంతరం నార్కో పరీక్షను చేపట్టారు. ఫోటో నిపుణుడు, ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణుడు, ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు, నోడల్ ఆఫీసర్, నార్కో, అంబేద్కర్ హాస్పిటల్‌తో కూడిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారుల బృందం నార్కో పరీక్షను నిర్వహించింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 11.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అతను వైద్యుల పరిశీలనలో ఉంచబడడంతో పాటు అతనికి మానసిక చికిత్స అందించారు. అఫ్తాబ్‌కు పూర్తి స్పృహ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసు బృందం అతడిని పూర్తి భద్రతతో తీహార్‌కు తీసుకెళ్లింది.

Drunk SI: తప్పతాగి పక్కింటికి వెళ్లిన ఎస్ఐ.. చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు

సోమవారం అఫ్తాబ్‌ ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్‌పై కొందరు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 365, 302, 201 కింద మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడైన అఫ్తాబ్ నార్కో పరీక్ష ఈ ఉదయం ప్రారంభమైందని ఐపీఎస్, స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. అంతకుముందు దేశ రాజధానిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో.. ఈ ఏడాది మేలో శ్రద్ధాను చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు ఆఫ్తాబ్ అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తరిగిన శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి క్రమంగా పారవేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.నిందితుడు ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నాడని ఢిల్లీ పోలీసులు సమర్పించిన తర్వాత ఆఫ్తాబ్‌పై పాలిగ్రాఫ్ పరీక్ష, నార్కో విశ్లేషణ నిర్వహించడానికి ఢిల్లీ కోర్టు పోలీసులను అనుమతించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aaftab Poonawala
  • delhi court
  • delhi crime
  • Delhi police
  • Narco Test

తాజావార్తలు

  • SRHvsLSG : ఉప్పల్‌లో లక్నో నవాబుల హవా.. సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Basara Temple : బాసర టెంపుల్ నమూనా.. మీరు చూశారా.?

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions