ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. ఈ ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం ఏకీకృత ప్రతిపాదికన రూ. 7969 కోట్లుగా వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 30% పైగా అధిక లాభాలను ఇన్ఫోసిస్ గడిచింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంకు గాను కంపెనీ రూ. 26,233 కోట్ల లాభాన్ని అర్జించింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సంస్థ చైర్మన్ నారాయణమూర్తి మనవడు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదు.. కానీ కట్టుబడి ఉన్నాం..!
చైర్మన్ నారాయణమూర్తి మనవడు ఇన్ఫోసిస్ డివిడెంట్ నుండి 4.2 కోట్ల రూపాయలను సంపాదించాడు. కేవలం ఐదు నెలలు ఉన్న ఏకాగ్ర రోహన్ మూర్తి తన తాత నారాయణమూర్తి మార్చి నెలలో బహుమతి ఇచ్చిన ఇన్ఫోసిస్ షేర్స్ నుండి ఈ ఆదాయాన్ని పొందాడు. కేవలం డివిడెండ్ ద్వారానే రోహన్ మూర్తి కోట్లకు అధిపతి అయ్యాడు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్ విలువ రూ. 1400 ఉండగా దాంతో 15 లక్షల షేర్ల విలువ దాదాపు రూ. 210 కోట్ల వరకు ఉండవచ్చు.
Also Read: Kakarla Suresh : వైసీపీ ప్రభుత్వంలో బతుకు భారం భవిష్యత్తు అంధకారం
ఇన్ఫోసిస్ లో వాటాన్ని కలిగి ఉన్నవారు దాని క్యూ4 ఫలితాల సమయంలో తుది డివిడెంట్ రూ. 20, ప్రత్యేక డివిడెంట్ రూ. 8 తో సహా కలిపి మొత్తం రూ. 28 గా కంపెనీ ప్రకటించింది. ఇక ఈ డివిడెంట్ చెల్లింపు రికార్డు తేదిని మే 31 గా నిర్ణయించారు. జూలై 1న ఈ చెల్లింపులు ఉండవచ్చు. నవంబర్ 10 బెంగళూరు నగరంలో నారాయణమూర్తి మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తి జన్మించాడు.