Narasaraopet MP Krishnadevarayalu Resigns to YSRCP: వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నరసరావు పేటలో కొత్త అభ్యర్దిని పెట్టాలని అధిష్టానం భావించిందని.. ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని ఆయన అన్నారు. దానికి తాను బాధ్యుడిని కాదన్నారు. కేడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు టికెట్లు విడుదల
యనను కలిసేందుకు మాచర్ల, పెదకూరపాడు ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆలోపే లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటన చేసినట్లు తెలిసింది. లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చొద్దంటూ 10 రోజులగా అధిష్ఠానానికి పల్నాడు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి గుంటూరు నుంచి పోటీకి దిగాలని శ్రీకృష్ణదేవరాయలకు అధిష్ఠానం సూచించింది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తేల్చిచెప్పారు. హైకమాండ్ నరసరావుపేట ఎంపీ టికెట్ తేల్చికముందే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు.