Site icon NTV Telugu

Nara Ramamurthy Naidu: సోదరుడికి సీరియస్‌.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు..

Nara Ramamurthy

Nara Ramamurthy

Nara Ramamurthy Naidu: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. అయితే, ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది.. కానీ, సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు చేసుకున్నారు.. తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రామ్మూర్తి నాయుడు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే.. హైదరాబాద్‌ బయల్దేరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ రానున్న ఆయన.. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.. మరోవైపు.. తన చినాన్న రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్‌.. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన అమరావతి నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన విషయం విదితమే..

Read Also: Nara Rammurthy Naidu: చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. హుటాహుటిన హైదరాబాద్‌కి లోకేష్‌..

Exit mobile version