విజయవాడలో నీట మునిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే.. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసంది ప్రభుత్వం. అయితే.. ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే.. విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నుంచి ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
• ఈరోజు సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా.
• బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా.
• గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్ లో 2,500 ఆహార పొట్లాలు చేరవేత.
• విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక చర్యలు.
• మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్న పార్టీ శ్రేణులు.
• విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 14,452 మంది నిరాశ్రయులు.
• ప్రకాశం బ్యారేజి వద్ద వేగంగా తగ్గుతున్న వరద, ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులు.
ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యలు
• వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలు అందించేందుకు నిరంతరం పనిచేస్తున్న 70 పునరావాస శిబిరాలు.
• పునరావాస శిబిరాల్లో 14,452 మంది.
• ముంపు ప్రభావిత ప్రజలకు నిరంతరం ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు, బిస్కెట్లు, పాలు సరఫరా.
• అనారోగ్యంగా ఉన్నవారికి డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ.
• నిరంతరం పనిచేస్తున్న 70 వైద్య శిబిరాలు.