NTV Telugu Site icon

Nara Lokesh: మరో రెండు కేసుల్లో నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు!

Nara Lokesh New

Nara Lokesh New

Nara Lokesh filed Anticipatory Bail Plea in Two other Cases: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్లు ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం విచారణకు రానున్నాయి.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ రాష్ట్ర హైకోర్టులో ఈరోజు ఉదయం విచారణ జరిగింది. లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోస్‌ చేసింది. ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది. అంతేకాదు విచారణకు పూర్తిగా సహకరించాలని లోకేష్‌ను హైకోర్టు ఆదేశించింది.