NTV Telugu Site icon

Nara Lokesh: అమిత్‌షాను కలిసిన నారా లోకేష్‌.. మా నాన్న ప్రాణాలకు హాని ఉందని ఆందోళన..

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.. ఫైబర్‌ నెట్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో కూడా సీఐడీ.. చంద్రబాబు పేరును చేర్చింది.. మరోవైపు నారా లోకేష్‌కి ఇన్నర్‌ రింగ్‌ రోడు కేసులో నోటిసులు.. రెండు రోజుల పాటు సీఐడీ విచారణ కూడా సాగింది.. అయితే, రాష్ట్రంలో తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వివరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం వైఎస్‌ జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ వెల్లడించారు.. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి వివరించారు లోకేష్. అంతే కాకుండా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్‌షా అభిప్రాయపడ్డారట.. ఇక, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో చెప్పారట అన్న అమిత్ షా. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలిసిన వివరాలను, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు నారా లోకేష్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని అమిత్‌షాకు వివరించాను.. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనీ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు..