Site icon NTV Telugu

Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి వాసులు నేపాల్ రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయిన ఘటనపై స్పందించారు. ప్రస్తుతం పశుపతి ఫ్రంట్ హోటల్‌లో 8 మంది మంగళగిరి వాసులు తలదాచుకుని ఉన్నారు. బాధితులు మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. బాధితులు తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి వద్ద మరో 40 మంది తెలుగువాసులు కూడా తలదాచుకున్నారని తెలిపారు.

KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?

ఈ విషయమై.. ఖాట్మండు ఎయిర్ పోర్టుకు కిలోమీటర్ల దూరంలోనే మీరు తలదాచుకున్న హోటల్ ఉంది. ఆందోళన చెందవద్దు, తాము క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరివాసులతో పాటు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కూడా టచ్‌లో ఉంటారని లోకేష్ తెలిపారు. ఈ కేసుపై ఎపి భవన్ అధికారి అర్జా శ్రీకాంత్, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మిలతో కలిసి మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.

Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 241 మంది తెలుగువాసులు నేపాల్‌లో చిక్కుకుపోయారని అధికారులు మంత్రి లోకేష్‌కు వివరించారు. ఇందుకు సంబంధించి నేరుగా భారత విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, సాధ్యమైనంత త్వరగా నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను రక్షించి రాష్ట్రానికి తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version