నందమూరి ఇంటి ఆడపడుచు గానో.. నారా వారి కోడలు గానో బ్రహ్మణిని మీరు చూసే ఉంటారు. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే.. చిన్ననాటి నుంచి ఇటు సినీ, రాజకీయ రంగాలను దగ్గరగా చూశారు నారా బ్రహ్మణి. ఆ రెండింటిని కాకుండా వ్యాపారంలోనూ తనకంటూ గుర్తింపు ఏర్పర్చుకున్న తెలివైన సమర్థవంతురాలైన నారీమణి నారా బ్రహ్మణి. అయితే.. ఆమె కుటుంబ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎన్నో ఉత్తమమైన నిర్ణయాలతో హెరిటేజ్ ఫుడ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా… హెరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలకు చదువుకోసం కూడా ఆమె ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : Samantha: మరోసారి విషమంగా సమంత ఆరోగ్యం.. చికిత్స కోసం అక్కడికి ?
అయితే.. ఇవేకా కుండా ఆమెలో మనకు తెలియని మరో టాలెంట్ కూడా దాగి ఉంది. ఆమెకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్ బైక్ రైడింగ్ గ్రూపులో మెంబర్ కూడా. ఇటీవల..జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. ఎంతో బరువుగా ఉన్న… బైక్‌ను ఆమె అంతదూరం ఎలాంటి అలుపుసొలుపు లేకుండా నడపడం చూస్తూ.. బ్రహ్మణిలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఆమె నడిపిన బైక్ కలర్ సైతం ‘పసుపు’ కావడం విశేషం.
Also Read : AP CM Jaganmohan Reddy: సీఎం జగన్ రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు