NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబానికి భువనేశ్వరి ఆర్థికసాయం..

Bhuvaneshwari

Bhuvaneshwari

Nara Bhuvaneshwari: కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరులో “నిజం గెలవాలి” యాత్రలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెనొప్పితో చనిపోయిన గోనేభావి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, అతని చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం.. అతని కుటుంబానికి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారని.. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

Read Also: Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ

ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్ధి అనురాధ, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస రెడ్డి, పెదకడుబూరు మండల కన్వీనర్ ఈరన్న, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Read Also: Chandrababu: వైసీపీ రాతియుగం కావాలా.. టీడీపీ స్వర్ణయుగం కావాలా..