NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతిమణీ నారా భువనేశ్వరి ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ క్రమంలో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.

Read Also: Ashok Galla: హనుమంతుడి టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడితో అంటే…

ఇక, 23వ తేదీ సాయంత్రం నారావారిపల్లెకు నారా భువనేశ్వరి చేరుకుంటారు. 24వ తేదీన కులదైవం నాగాలమ్మకు పూజలు చేసి, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన రైతు చిన్నబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత పనపాకం లేక రాయలపురం ఎస్సీ కాలనీలో ఆమె భోజనాలు చేస్తారు.. 25వ తేదీ ఉదయం తిరుమలకు చేరుకుంటారు.. ఆ తర్వాత చంద్రగిరి సమీపంలో అగరాల నేషనల్ హైవే పక్కన అమర్నాథ్ రెడ్డి వియ్యంకుడు వెంకటరెడ్డి స్థలంలో 5 వేల మంది మహిళలతో నారా భువనేశ్వరి మీటింగ్ నిర్వహిస్తారు.

Read Also: SL vs NED: ఎట్టకేలకు బోణీ కొట్టిన లంకేయులు.. నెదర్లాండ్కు వరించని లక్

‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ శ్రేణులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ఆరంభిస్తారని నారా లోకేశ్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి 25వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అదే రోజు నిజం గెలవాలి అనే యాత్రను ప్రారంభిస్తారు.