నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం, 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాని ‘జడల్’ (Jadal) అనే మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కూడా ఇందులో భాగం కావడంతో పాటు..
Also Read : Valentine’s Day : వాలెంటైన్స్ వీక్ స్పెషల్.. థియేటర్లలో మళ్లీ ఐదు క్రేజీ సినిమాలు రీ-రిలీజ్ !
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఏంటంటే ఈ చిత్రంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్రలో (విలన్‌గా) కనిపించబోతున్నారని సమాచారం. కెరీర్ మొదట్లో విలన్‌గా మెప్పించిన ఆయన, చాలా కాలం తర్వాత మళ్లీ అటువంటి పదునైన పాత్రను పోషిస్తుండటం విశేషం. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, నానితో ఆయన తలపడే సన్నివేశాలు ప్రేక్షకులను అశ్చర్యనికి గురిచేస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలి.
