NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram : నాని సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..

Whatsapp Image 2023 10 23 At 12.18.12 Pm

Whatsapp Image 2023 10 23 At 12.18.12 Pm

నేచరల్ స్టార్ నాని గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్స్ తో ఎంతో ఇబ్బంది పడ్డాడు.. దీనితో ఈ ఏడాది వచ్చిన దసరా మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. దసరా సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దసరా సినిమా తరువాత నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో  మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్ంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా చేస్తూనే దర్శకుడు వివేక్ అత్రేయ తో మరో సినిమాను నాని అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు..

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.వీటితో పాటు నాన్ అన్‌చైన్‌డ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో కూడా ఎంతో ఆసక్తిని పంచుతోంది. సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా సాగింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతికి ఉన్న సంకెళ్లను తెచ్చుకుంటూ ఎంతో రౌద్రంగా నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నాని కనిపించబోతున్నాడు. సరిపోదా ఆయుధ పూజతో ఆరంభం అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. టైటిల్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వుంది..సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్రను పోషించనున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది.. నాని 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.

https://x.com/NameisNani/status/1716330633327423706?s=20