Saripodhaa Sanivaaram : నాని సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచరల్ స్టార్ నాని గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్స్ తో ఎంతో ఇబ్బంది పడ్డాడు.. దీనితో ఈ ఏడాది వచ్చిన దసరా మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. దసరా సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దసరా సినిమా తరువాత నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్ంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా చేస్తూనే దర్శకుడు వివేక్ అత్రేయ తో మరో సినిమాను నాని అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు..
నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.వీటితో పాటు నాన్ అన్చైన్డ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో కూడా ఎంతో ఆసక్తిని పంచుతోంది. సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా సాగింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతికి ఉన్న సంకెళ్లను తెచ్చుకుంటూ ఎంతో రౌద్రంగా నాని కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నాని కనిపించబోతున్నాడు. సరిపోదా ఆయుధ పూజతో ఆరంభం అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. టైటిల్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వుంది..సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్రను పోషించనున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది.. నాని 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..