Hi Nanna : మరో అరుదైన ఘనత సాధించిన నాని సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ప్లస్ అయ్యాయి. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించింది.థియేటర్స్ లో మంచి విజయం సాధించిన హాయ్ నాన్న రూ.76కోట్ల వసూళ్లను సాధించి అదరగొట్టింది.
థియేటర్స్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది జనవరిలో స్ట్రీమింగ్కు వచ్చింది.. ఓటీటీలో కూడా హాయ్ నాన్న మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. భారీ వ్యూస్ సాధించి అదరగొట్టింది .ఇదిలా ఉంటే ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది .హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై వరుస అవార్డులు లభించాయి. తాజాగా ఈ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించింది.స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో హాయ్ నాన్న సినిమా ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకుంది. ఈ స్వీడెష్ ఫిల్మ్ ఫెస్టివల్లో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ కు మూడు అవార్డులు , డైరెక్టర్ శౌర్యువ్కు రెండు అవార్డులు , నాని – మృణాల్ జోడికి ఓ అవార్డు దక్కింది.హాయ్ నాన్న సినిమాకు అవార్డులు రావడం పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా వున్నారు. “ప్రేమ, ప్రశంసలతో సినిమా సెలెబ్రేషన్ జరుగుతోంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాయ్ నాన్నసినిమా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ప్రేమకు అసలైన ప్రతిధ్వని ఇది. 18 ఇంటర్నేషనల్ అవార్డులు.. కౌటింగ్” అని వైరా ఎంటర్టైన్మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.
Also Read
Celebrating cinema with LOVE and ACCOLADES ❤️🔥❤️🔥❤️🔥#HiNanna sweeps six awards at the Swedish International Film Festival 2024 ✨
A true resonance of Love
18 International awards & counting✨
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese… pic.twitter.com/l4p8pXNFXO
— Vyra Entertainments (@VyraEnts) May 5, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు