Site icon NTV Telugu

Nani: నాని లైనప్‌లో మరో క్రేజీ మూవీ..?

Nan

Nan

నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు తన రూటు మార్చి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్‌గా ‘హిట్ 3’ వచ్చిన్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే పీరియాడిక్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్‌లో ‘బ్లడీ రోమియో’ సెట్స్‌లోకి వెళ్లనున్న నాని, తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన ఒక ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ కథకు నాని బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ చిత్రానికి ‘గౌరీ తనయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల్లో ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలువబడే కార్తికేయుడి (కుమారస్వామి) పౌరాణిక అంశాలను నేటి కాలపు పరిస్థితులకు జోడించి, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని కిషోర్ తిరుమల సిద్ధం చేశారని టాక్.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే, నాని కెరీర్‌లోనే ఇది మొదటి సోషియో ఫాంటసీ మూవీ అవుతుంది. పురాణాలకు, సమకాలీన అంశాలకు ముడిపెడుతూ తీసే ఇటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సంపాదిస్తున్నాయి. గతంలో వచ్చిన ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’ వంటి చిత్రాల తరహాలోనే ‘గౌరీ తనయ’ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని చేతిలో ‘ది ప్యారడైజ్’ (మార్చి 26, 2026 రిలీజ్) మరియు ‘బ్లడీ రోమియో’ వంటి క్రేజీ చిత్రాలు ఉండగా, ఈ కొత్త మూవీ ఆయన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. నాని నుండి రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version