Nani : ప్రస్తుతం నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ తో జోరు మీద ఉన్నాడు. ఈ సినిమా అతడికి హ్యాట్రిక్ హిట్ అందించింది. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌసులో శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీని తర్వాత దసరా వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో దర్శకత్వంలో నాని రెండో సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also:Hyundai Motor India IPO: ఇన్వెస్టర్లకు షాక్.. ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్లోకి ఎంట్రీ
దీని తర్వాత క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నాని ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలతో నాని డైరీ ఫుల్ గా ఉంది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో నాని మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఆయనపై బిజినెస్ నడుస్తోంది. దీంతోపాటు డిజిటల్ మార్కెట్ కూడా నాని సినిమాలకు బాగా పెరిగింది. ఆయన సినిమాలు మంచి ప్రీమియం ధరలకు ఓటీటీ ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నానితో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. పెరిగిన మార్కెట్ నేపథ్యంలో నాని తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు టాక్ వినపడుతుంది. ‘హిట్ 3’ తర్వాత చేయబోయే సినిమాలకి నాని రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం టైర్ టు హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ గా నాని ఉన్నాడు. నిర్మాతలు కూడా నాని డిమాండ్ చేసింత ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. హిట్ 3 మూవీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటే నాని టైర్ వన్ హీరోల జాబితాలోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి వెనుకాడకపోవచ్చని అంతా అనుకుంటున్నారు.
Read Also:MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్