Site icon NTV Telugu

Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

Nani Dasara

Nani Dasara

Dussehra: నాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్లాపులు వెంటాడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నాని నటించిన దసరా మూవి ఆ అసత్య ప్రచారాలకు చెక్ పెడుతోంది. ఆ సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో విడుదల కాబోతున్న ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగింది అని అంటున్నారు.

Read Also: T20 World Cup: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. 15ఏళ్లలో తొలిసారి

దసరా సినిమాలోని మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’ ఈ మధ్య విడుదలైంది. దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఈపాటలో నాని చాల రఫ్ లుక్ లో గుబురు గడ్డం చింపిరి జుట్టు మాసిన లుంగీ నలిగిన చొక్కాతో చాలా రఫ్ గా కనిపించాడు. అయితే ఈ లుక్ ను ‘పుష్ప’ లో అల్లు అర్జున్ గెటప్ తో సరిపోలుస్తూ సోషల్ మీడియాలో కొందరు నానీని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Read Also:Shruti Haasan: హాలీవుడ్ కు వెళ్తున్న శ్రుతి హాసన్

ఇప్పటికే నాని రఫ్ లుక్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చూసామని ఇలాంటి లుక్ ను మళ్ళీ నాని రిపీట్ చేయడం వల్ల ‘దసరా’ సినిమాలో ఏ స్పెషాలిటీ కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ లుక్ ను ‘పుష్ప’ మూవీలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రతో పోలుస్తున్నారు. ‘పుష్ప’ మూవీలో రష్మిక పెళ్లి కూతురుగా పసుపు రంగు చీరలో ఎలాగైతే కనిపించిందో.. అలాంటి ఛాయలే కీర్తి సురేష్ లో కనిపించడంతో మరికొందరు సోషల్ మీడియాలో ‘పుష్ప’ ఛాయలు ‘దసరా’ లో ఉన్నాయా అంటూ సందేహాం వ్యక్తపరుస్తున్నారు.

Exit mobile version