Nani – Srikanth odela : పూజా కార్యక్రమాలతో నాని-ఓదెల రెండో ప్రాజెక్ట్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani – Srikanth odela : గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు హీరో నాని. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలో సింగరేణి నేపథ్య కథ అని ప్రచారం జరిగింది.
Read Also:Utsavam: ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ఉత్సవం
Also Read
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు దసరా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఆ వీడియో రిలీజ్ చేయకుండానే, సినిమా ఓపెనింగ్ జరిగింది. దసరా సందర్భంగా ఈరోజు నాని – శ్రీకాంత్ ఓదెల కొత్త సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Read Also:Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
దేవుడి చిత్రపటాలపై నాని క్లాప్ తో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ప్రస్తుతానికి పూజ జరిగిందని, మిగతా వివరాలను తర్వాత ప్రకటిస్తామన్నారు. బహుశా.. అనౌన్స్ మెంట్ వీడియో ఇంకా రెడీ అవ్వలేదేమో. గత నెల 18న వీడియో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాపై ఇప్పటికే చాలా విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారని, మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే అవేవీ నమ్మొద్దంటూ నిర్మాత సుధాకర్ ఏకంగా ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం.
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!