Site icon NTV Telugu

#Nani34: నాని-సుజిత్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ భామలు.. ప్లాన్ మాములుగా లేదుగా !

Nani 34 , Sujeeth , Triptii Dimri

Nani 34 , Sujeeth , Triptii Dimri

వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో మాస్ అవతారంలో నటిస్తున్నారు. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాని, ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నారు. ‘దసరా’, ‘హిట్ 3’ సినిమాలతో ఆ దిశగా అడుగులు వేస్తున్న నాని, ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌లో బూతు పదాలు వాడటంపై కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కన పెట్టి మరీ నాని చేస్తున్న ఈ ‘మాస్’ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా పూర్తి కాకముందే నాని తన తదుపరి చిత్రం (#Nani34) కోసం ‘ఓజీ’ ఫేమ్ సుజిత్‌తో చేతులు కలిపారు.

Also Read : Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?

ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా క్యాస్టింగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాని సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెక్కల నేపథ్యంలో హిందీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవడానికి త్రిప్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ పాత్ర కోసం అలనాటి అతిలోక సుందరి మాధురి దీక్షిత్ పేరు వినిపిస్తోంది. సుజిత్ ఆమెను ఒక స్టన్నింగ్ రోల్ కోసం సంప్రదించారని, అది నాని తల్లి పాత్రనా లేక మరేదైనా కీలక పాత్రనా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ మాధురి దీక్షిత్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆమె నటించే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. నానిని ఇప్పటి వరకు ఎవరూ చూపని విధంగా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడానికి సుజిత్ భారీ స్కెచ్ వేస్తున్నాడట. ఈ వార్తల గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version