Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTuber Rama Nandana: సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్.. నోరు తెరిస్తే చాలు విదేశీ ముచ్చట్లు చెప్పే యూట్యూబర్ రమానందన, ఆమె భర్త మధుకర్ దంపతుల లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక అమాయకులను ముంచేసే పెద్ద స్కెచ్ ఉందనే నిజం ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి మోసాల భాగోతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఫేక్ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఈ జంట పలువురిని బురిడీ కొట్టించినట్లు ఇప్పటికే విజయవాడ, ఇబ్రాహీంపట్నంతో పాటు బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి విధితమే. తాజాగా తమిళనాడుకు చెందిన మరో బాధితుడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో ద్వారా వీరి లీలలను బయటపెట్టాడు.
యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించడంతో తాను ‘నందూస్ కిచెన్’లో మూడేళ్ల స్పాన్సర్షిప్ కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. తీరా అక్కడికి వెళ్లి ఉద్యోగంలో చేరిన ఏడాదికే నిబంధనల ఉల్లంఘన కారణంగా రెస్టారెంట్‌ను మూసివేశారని, గడిచిన కొన్ని నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా తీవ్రంగా వేధించారని ఆరోపించాడు. విదేశీ కలలతో వచ్చిన తనలాంటి ఎంతో మంది యువకులు డబ్బుతో పాటు అమూల్యమైన సమయాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు కష్టపడి సంపాదించిన డబ్బులు అడిగేందుకు వస్తే ఇంటికి రమానందన్ తన భర్త మధుకర్‌ను బాత్రూమ్లో దాచిపెట్టేదని సంచలన ఆరోపణ చేశాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!