టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, క్రేజీ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ ఓ బేబీ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా ఎన్టీవీ (NTV) పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న డైరెక్టర్ నందిని రెడ్డి.. సమంత ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. నిజానికి సమంత తాను ప్రెగ్నెంట్ అని ఈ సినిమా థాంక్యూ మీట్లో అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో నందిని రెడ్డి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఎమోషనల్ అండ్ షాకింగ్ సీక్రెట్‌ను షేర్ చేసుకున్నారు. “మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. సామ్ (సమంత) కన్సీవ్ (గర్భవతి) అయ్యిందనే విషయం తెలిసింది. ఆ టైమ్‌లో ఆ గుడ్ న్యూస్ సెట్‌లో ఒక్క నాకు మాత్రమే తెలుసు. వేరే ఎవరికీ ఈ విషయం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాం.” అని నందిని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ సమయానికే సినిమాకు సంబంధించిన ఒక మేజర్ టాస్క్ పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. “లక్కీగా అప్పటికే చిత్రానికి సంబంధించిన హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు మొత్తం కంప్లీట్ చేసేశాం. దాంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఆ తర్వాత మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం సమంత హెల్త్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా స్ట్రెయిన్ అవ్వకుండా, కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తూనే మిగతా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం” అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.
నందిని రెడ్డి ఎన్‌టీవీ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఈ ఎక్స్‌క్లూజివ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

