NTV Telugu Site icon

MLA Arthur: నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక వ్యాఖ్యలు..

Mla Artur

Mla Artur

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆర్థర్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగినంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని తెలిపారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. కాగా.. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డా.సుధీర్ ను అధిష్టానం ప్రకటించింది. నందికొట్కూరు నుంచి తనను తప్పించడంతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆర్థర్.

Read Also: Sajjala Ramakrishna Reddy: ఏపీలో షర్మిల హడావిడి చూసి బాధపడ్డాం, జాలి పడుతున్నాం..

కాగా.. ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ, తనను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్నారు. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు. నందికొట్కూరు టికెట్ వద్దన్నానని, ఎమ్మెల్యే పదవి తనకు, అధికారాలు వేరేవాళ్లకు అంటేనే టికెట్ వద్దన్నానని ఆర్థర్ వెల్లడించారు.

Read Also: MP Balasouri: పవన్తో ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను..