FNCC సభ్యులు, కుటుంబ సభ్యులు, అతిధులు అధిక సంఖ్యలో మహిళలు ఈ బంపర్ తంబోలాలో పాల్గొన్నారు. ఈ బంపర్ తంబోలాలో గెలిచినా వారికి 5 రౌండ్స్ ఐదు కార్లు ఆల్టో, సెలెరియో, టాటా టియాగో, టొయోట గ్లాంజా, బంపర్ ప్రైజ్ మెర్స్డ్స్ బెంజ్ ఎ క్లాస్ లను అందజేశారు. బెంజ్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్, డి. సాయికిరణ్. బంపర్ తంబోలా విన్నర్స్ కు FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు, నందమూరి వసుంధర గారి చేతుల మీదుగా బహుమతులు అందించారు.
Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్జ్ఞనందా..
ఈ కార్యక్రమంలో FNCC సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి, తంబోలా కమిటీ సభ్యులు స్వరూప, చేతనా, రోహిణి, శైలజ, హకీమ్ మొదలగు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా నవనామి – మెగాలియో, డి ఎస్ ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడీస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్షిప్స్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్, హర్ష ఆటో, మందిర్, ప్రకృతి ఎవెన్యూస్ & వంశీరాం బిల్డర్స్ వ్యవహరించారు.
Bullets in Airport: ఎయిర్పోర్టులో కలకలం.. నటుడి బ్యాగులో 40 బులెట్లు..
ఈ క్రయక్రమంలో భాగంగా సెక్రటరీ ముళ్లపూడి మోహన్ గారు మాట్లాడుతూ.. గతంలో కూడా తాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశామని., అప్పుడున్న కమిటీ ప్రస్తుత కమిటీ సపోర్ట్ ద్వారానే ఇది అంతా జరుగుతోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మెంబెర్స్ కు రిలాక్సేషన్ లభిస్తుందని., ఇంకా ముందుముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ FNCC ని ఇండియా లోనే నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కమిటీ సభ్యుల సహారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు అందిస్తామని., ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి సపోర్ట్ చేసిన నందమూరి వసుంధరకు నా తరఫున మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు.