Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్

Nandamuri Tejaswini

Nandamuri Tejaswini

Nandamuri Tejaswini: నిజానికి నందమూరి కుటుంబం సాధారణంగా మీడియా హడావుడికి దూరంగా ఉంటుందన్నా సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా చాలా తక్కువగానే మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ తాజాగా హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినికి సంబంధించిన ఒక వీడియో కారణంగా ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

తేజస్విని ఎప్పుడూ క్లాస్, రిజర్వ్‌డ్‌గా కనిపిస్తుంది. కానీ తాజాగా తనలోని అసలైన టాలెంట్‌ ఏంటో బయట పెట్టింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను థానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాంగ్ బీట్స్‌కు కరెక్ట్ గా ఆమె చూపించిన గ్రేస్, ఎనర్జీ చూస్తుంటే వావ్ అనాల్సిందే. ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశర్యపోతున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, భవిష్యత్తులో సినిమాలకు సంబంధించిన పనుల్లో పనిచేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

×
×
Ad