Site icon NTV Telugu

Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే

Nbk Koratala

Nbk Koratala

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది.

Also Read : May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు

బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట కొరటాల. ఈ కథ బాలకృష్ణ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోతుందని ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో పాటు కొరటాల మార్కు మెసేజ్ కూడా ఇందులో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను బడా నిర్మాణ సంస్థ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ నటించాల్సిన ‘దేవర-2 పనుల్లో ఉన్నారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఇతర కమిట్‌మెంట్స్ డ్రాగన్ తో బిజీగా ఉండటం వల్ల దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ను కొరటాల శివ ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పట్టాలెక్కితే అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version