NTV Telugu Site icon

Balakrishna: దీపావళి నుంచి బాలయ్య కొత్త అవతారం.. కెరీర్లో తొలిసారి

Balakrishna

Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇంతవరకు చేయని పని ఇప్పుడు చేయబోతున్నారు. తొలిసారి కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నారు. తన తోటి హీరోలు యాడ్స్ తో కోట్లు సంపాదిస్తుంటే బాలయ్య మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. యాడ్స్ లో నటించకపోవడానికి ఒక కారణం ఉందని ఓ సందర్భంలో బాలయ్య చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడూ ఇమేజ్ ను అడ్డం పెట్టుకొని ప్రకటనల్లో నటించలేదన్నారు. ప్రేక్షకుల వలనే ఈ ఇమేజ్ వచ్చిందని.. అందుకే వాళ్లను మెప్పించే సినిమాలు చేసి వారి అభిమానాన్ని పొందాలని.. అంతేకానీ వాళ్లిచ్చిన ఇమేజ్ ను మన స్వార్ధం కోసం ఉపయోగించకూడదనేది నాన్న గారి అభిప్రాయమని.. ఆయన బాటలోనే తను కూడా ఇప్పటివరకు యాడ్స్ చేయలేదని చెప్పారు బాలయ్య. ప్రజలకు ఏమైనా మేలు జరిగితే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు.

Read Also: Ahimsa: ‘అహింస’కు మసాలా అద్దిన డైరెక్టర్ తేజ.. అదిరిపోయిందిగా

అన్‌స్టాపబుల్‌, అఖండ విజయాల తర్వాత బాలయ్యలో చాలా మార్పులు వచ్చాయి. తాజాగా బాలయ్య నిర్ణయం ఆయన అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా షాక్ కి గురి చేసింది. ఇంతకీ బాలయ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే.. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఓ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బుని బాలయ్య తన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ హాస్పిటల్ లో చాలా మంది క్యాన్సర్ పేషంట్స్ కి అతి తక్కువ ధరలతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు బాలయ్య. ఇక తమ అభిమాన హీరో యాడ్ లో నటిస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు.. యాడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Mega 154: ‘వాల్తేరు వీరయ్య’ గా చిరు.. అదిరిపోయిన టీజర్

దీపావళి నుంచి టీవీల్లో యాడ్ ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మొత్తానికి బాలయ్య యాడ్ రంగంలో అగ్రగామిగానున్న మహేష్, బన్నీ లకు పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బాలయ్య మాటకు విలువ ఉంటుంది. కచ్చితంగా బాలయ్య యాడ్స్ జనంలోకి బాగా వెళ్తాయి. మరోపక్క బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు.

Show comments