NTV Telugu Site icon

Goshamahal Constituency: గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్

Goshamahal

Goshamahal

Goshamahal Constituency: జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలక స్థానమైన గోషామహల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. నందకిషోర్‌ వ్యాస్‌ పేరును గులాబీ బాస్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ తరపున అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త బలంగా కనపడుతున్నారు. కానీ ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోడానికి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే అభ్యర్థిని కూడా చివరి వరకు ప్రకటించలేదు. తాజాగా ఆ స్థానాన్ని నంద కిషోర్ వ్యాస్ బిలాల్‌ కు కేటాయించారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నంద కిషోర్ బీ ఫామ్‌ అందుకున్నారు.

Also Read: Revanth Reddy: రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్..

కాగా, గోషామహల్‌ నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా రాజాసింగే కావడం గమనార్హం. దీంతో ఈసారి ఎలాగైనా గోషామహల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావించింది. సరైన నేతను బరిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆలస్యం చేసింది. చివరకు నందకిషోర్ వ్యాస్‌ను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.