పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు.. హారతులు పట్టారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వేల్పూరులో గత ఐదేళ్లలో 25 కోట్లతో సంక్షేమం అందించామన్నారు. రూ.2.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ.2.18 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రూ.3.85 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అత్యధికంగా రూ.8.20 కోట్లు అవ్వాతాతలకు అందించామన్నారు. చేయూత ద్వారా రూ.1.80 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా రూ.1.10 కోట్లు అందించామన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి 83 లక్షలు ఖర్చు చేశామన్నారు. గ్రామంలో రూ.91 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా రూ.1.13 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం చేసిన దాంట్లో కనీసం నాలుగో వంతు అభివృద్ధి అయినా టీడీపీ హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. 2019లో తాను వచ్చేనాటికి రోడ్లు దీనావస్థలో ఉంటే.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగు చేశామన్నారు.
అమరావతి – బెల్లంకొండ రోడ్డు 149 కోట్లతో పూర్తి చేస్తున్నామన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జి కూడా టెండర్ పూర్తైందని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టే ఇప్పుడు ధైర్యంగా ఓట్లు అడుగుతున్నానన్నారు. టీడీపీ నేతలు ఏం అభివృద్ధి చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. గ్రామస్థులు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా మంచి చేసిన వారిని గుర్తించి ఓట్లు వేయాలని సూచించారు. అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలో సుమారు 83 కోట్లతో స్కూళ్లు బాగు చేశామన్నారు. 27 కోట్లతో ఆస్పత్రులు బాగు చేశామన్నారు. టీడీపీ హయాంలో ఒక్క ఆస్పత్రి బాగు చేశారా.. ఒక్క స్కూల్ బాగు చేశారా అని ప్రశ్నించారు. ప్రజలు గత ఐదేళ్లలో జరిగిన మంచిని గుర్తించి.. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్ధిగా శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాలని కోరారు.
అచ్చంపేట మండలం వేల్పూరులో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. అచ్చంపేట మండలం వేల్పూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో సుమారు 30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానన్నారు. సీఎం జగన్ పాలనలో చేసిన మంచి, జరిగిన అభివృద్ధి చూసి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్ నెస్ సెంటర్ నిర్మించామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అందించామన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ గారిదేనన్నారు. బెల్లంకొండ – అమరావతి రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జితో పాటు ఆస్పత్రులు బాగు చేశామన్నారు. నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి చేశామన్నారు. 2014లో పొత్తులు, బూటకపు హామీలతో ప్రజలను మోసంచేసిన చంద్రబాబు.. మళ్లీ అదే కుట్రమార్గంలో వస్తున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే.. పెత్తందార్ల పాలనతో పేదలు ఇబ్బందులు పడతారన్నారు. పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాలని కోరారు.
