భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వతేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్వారావుపేట గెలుపు కోసం నియోజకవర్గ కేంద్రమైన దమ్మపేటలో ఆశీర్వదా సభ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. 12 గంటలకు సభ ప్రారంభం కానున్నదని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గంలో సభలు పూర్తయ్యాయని, ఆ సభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తండోపతడలుగా వచ్చారన్నారు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ రాష్ట్ర సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసి ఈ సారి కూడా అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ పెట్టిన రైతు బంధు సంక్షేమ పథకం వైపు చూస్తున్నారు. ఒక్క రైతులకే లక్ష కోట్లా రూపాయలు రైతుల అకౌంట్ లో వేయడం జరిగింది. 24 గంటలు రైతులకు ఉచిత విద్యత్. రైతు బీమా ఇలా ఎన్నో పథకాలు కేసీఆర్ చేశారు కళ్యాణి లక్ష్మీ. షాది ముభరక్ ఎలా ఎన్నో సంక్షమ పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి కే సాధ్యమయ్యాయి.. 2016 పెన్షన్ నుండి 5016 మా తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ని ప్రోత్సహించిది కేసీఆర్ మాత్రమే. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో 15 ఫ్యాక్టరీ లకు శంకుస్థాపన.. కాంగ్రెస్ 6 గ్యారంటీలను. మాయమాటలు మోసపురిత మాటలు నమ్మాల్సిన వసరం లేదు. రైతుల ఆత్మహత్య పెరిగిందే కాంగ్రెస్ పాలనలో తాగు సాగు నీరు లేనిది మీ కాంగ్రెస్ పాలనలోనే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యలు పై పార్లమెంట్ లో ప్రస్తావించలేదు. తెలంగాణా వ్యతిరేకి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణ నుండి పరదరోలిసిన అవశక్యత ఉంది అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు.