అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజల ఆత్మీయ సమావేశంలో మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తాను కూడా పాల్గొంటానని, అదే విధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. తొలి సినిమాతో స్ట్రగుల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలందరి అభిమానం పవర్ స్టార్ గా మారారని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారని, బీజేపీ,టిడిపి, జనసేన ను పవన్ కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని బలిజలు గెలిపించి రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదంటే మోడీ నిజాయతికి నిదర్శనం అన్నారని, వచ్చే 2029 ఎన్నికల్లో మహిళలకు చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కలిస్తున్న ఘనత నరేంద్ర మోడీదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ పిడికిలి వైసిపి పార్టీని ఓడించాలని, రాజంపేట పార్లమెంట్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని కిరణ్ కోరారని ఆయన పేర్కొన్నారు.