నాకు 15 వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని లోకేష్ ఆరోపించారని, అందులో ఒక శాతం ఇవ్వు చాలు అని అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తనపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ.. నా ఆస్తులు గురించి వివరాలు తెలుసుకునేందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కళా వెంకట్రావు బీద రవిచంద్ర వెంకటేశ్వర్లును పంపించు అని, వాళ్లంటే నాకు గౌరవం అన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఇస్తానని, వాళ్ళే నిరూపిస్తారన్నారు. నేను వెకేషన్ కి వెళ్ళాను అని చెప్పారని, నాకు ఎక్కడికీ వెళ్లి అలవాటు లేదన్నారు. పాస్ పోర్ట్ ఇస్తా..చూసుకో అని ప్రసన్న కుమార్ అన్నారు. కేవలం హైదరాబాద్ కే వెళుతుంటా అని, నాకున్న ఆస్తుల వివరాలన్నీ ఇస్తాను ..బ్యాంకు లాకర్లు కూడా ఇస్తానని, విదేశాల్లో అమ్మాయిలతో ఎవరున్నారో అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Richest Beggar: జనాలను బిత్తిరోళ్లను చేసిన బిచ్చగాడు.. ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
మీ తాత రెండు ఎకరాలు పొలం మీ నాన్నకి ఇస్తే ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని, నా గురించి చంద్రమోహన్ రెడ్డి.. రామనారాయణరెడ్డి లను అడుగు.. నీ వెనకే ఉన్నారు కదా.. నా గురించి వాళ్లే చెప్పేవారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం సరికాదు. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గురించి పొగిడారు.. ఆయనకున్న లక్షణాలు లేవని అన్నారు.. అలాంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి తొలగించేదాకా చంద్రబాబు నిద్రపోలేదు. ఎన్టీఆర్ అభిమానులు అందరినీ పక్కన పెట్టారు. ఆరుసార్లు నన్ను ఎమ్మెల్యేగా కోవూరు ప్రజలు గెలిపించారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రతి నియోజకవర్గంలోకి వెళ్లి ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దూరం పెట్టారు. ఆ కుటుంబాన్ని బుట్టలో వేసుకునేందుకు. ఎంతో మంచోడైన బాలకృష్ణను మచ్చిక చేసుకుని ఆయన కూతురును చేసుకున్నారు. రాజకీయ కోసం చంద్రబాబు దేనికైనా తెగిస్తారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ’ అని ఆయన అన్నారు.
Also Read : Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!