Site icon NTV Telugu

Child Rape Case: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. నిందుతుడికి ఉరిశిక్ష!

Nalgonda Pocso Court

Nalgonda Pocso Court

Accused was sentenced to death in Nalgonda: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందుతుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో, హత్య కేసులో నిందుతుడికి ఉరిశిక్ష విధించింది. అంతేకాదు జరిమానాగా లక్షా పది వేల రూపాయలు కట్టాలని ఆదేశించింది. నిందుతుడికి ఉరిశిక్ష విధించిన నల్గొండ కోర్టుపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Google Pixel 8a Price: ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’పై 15 వేల తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!

2013లో మొహమీ ముక్రమ్ అనే వ్యక్తి 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారం చేశాడు. అనంతరం మైనర్ బాలికను హత్య చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని నాలాలో పడేశాడు. మూడు రోజుల తర్వాత పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2015లో ఛార్జ్ షీట్ దాఖలు అయింది. గత 10 ఏళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. పోక్సో, హత్య నేరం కేసులో తాజాగా నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నేడు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెలువరించారు.

Exit mobile version