Google Pixel 8a Price: ‘గూగుల్ పిక్సెల్ 8ఏ’పై 15 వేల తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!
- ఆగస్టు 17 వరకు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్
- గూగుల్ పిక్సెల్ 8ఏపై బంపర్ ఆఫర్
- క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 5 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs 15000 Discount on Google Pixel 8a in Flipkart Freedom Sale: 2025 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 13 నుంచి 17 వరకు కొనసాగుతుంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలపై బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్, మోటరోలా, ఎంఐ, నథింగ్, వివో, గూగుల్ పిక్సెల్, ఒప్పో వంటి స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ‘గూగుల్ పిక్సెల్ 8ఏ’ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. ఆ డీటేల్స్ ఓసారి చూద్దాం.
![]()
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.37,999కి లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28 శాతం తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అదనంగా వర్తిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గనుంది. గూగుల్ పిక్సెల్ 8ఎపై 7 సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 8ఏ ఫీచర్స్ తెలుసుకుందాం.
![]()
గూగుల్ పిక్సెల్ 8ఏ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన లెన్స్‌తో పాటు 13 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో కెమెరాను ఇచ్చారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4404 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కూడా ఉంది.
![]()
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!