Site icon NTV Telugu

Nalgonda: కాబోయే డాక్టర్లు ఇదేం పని.. నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

Ragging

Ragging

Nalgonda: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈ నెల 4న చోటుచేసుకుంది. గత నెల 31వ తేదీన హాస్టల్‌లోనే రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ పెద్దగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. తమపై ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన రెండో సంవత్సరం విద్యార్థులు నవంబర్ 4న మళ్లీ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనతో కాలేజీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.

READ MORE: Keerthy Suresh : పెళ్లి తర్వాత స్పీడ్‌ పెంచిన కీర్తి – కొత్త యాక్షన్‌ చిత్రం ప్రకటించిన బ్యూటీ

Exit mobile version