ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్ పర్యటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ఎండిపోయిన పంటల పేరుతోటి కేసీఆర్ రాజకీయం చేయడాన్ని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం కేసీఆర్ రైతుల దగ్గర ముసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 90 శాతం కలవాలని నిర్మాణం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మిగిలిన 10 శాతం కాలువల నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు రైతుకు ఈ ఇభందులు వచ్చేదా.. కేసీఆర్ అనాలోచిత చర్యలతోనే పాలకుర్తి రైతులకు నష్టం జరిగిందన్నారు.
Virat Kohili – Rinku Singh: మ్యాచ్ లోనే రింకూను ర్యాగింగ్ చేసిన కోహ్లీ..!
ఒక్క రైతు బంధు పెట్టి నష్ట పరిహారాలు ఎత్తేసి కేసీఆర్ ఇప్పుడు రైతులను పరమర్శకు రావడం విడ్డురంగా ఉందని, అధికారం లో ఉండగా ఒక్కరోజు ఎండిపోయిన పంటలను చూడని కేసీఆర్ ఎన్నికల సమయంలో ముసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తర్వాత వర్షాలు పడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు నెలలు కాలేదు అప్పుడే రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలనాన్ని తొలగించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
Janga Krishna Murthy: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?