Site icon NTV Telugu

Naina Jaiswal Father : నైనా జైస్వాల్‌ని కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడు

Naina Jaiwal

Naina Jaiwal

ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ నైనా జైస్వాల్‌కు గత కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వేధింపులపై ఆమె పోలీసులను సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నైనా జైస్వాల్‌ తండ్రి అశ్విన్ జైస్వాల్ మాట్లాడుతూ.. నైనా జైస్వాల్ ని కావాలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడన్నారు. మెసేజ్ లు చేస్తున్న యువకుడు… సిద్ధిపేట కి చెందిన శ్రీకాంత్ ఎంకామ్‌ చేసాడు అంటున్నారు. మతిస్థిమితం లేదు అని పోలీసులు చెప్తున్నారు. కానీ… యువకుడు ఎంకామ్‌ చేసి, ట్విట్టర్, ఇన్స్‌స్టా, ఫేస్‌బుక్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నాడు అంటే… మతిస్థిమితం లేకుండా ఎలా ఉంటాడు. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నాడు. తెలంగాణ షీ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నైనా జైస్వాల్ కే వేధింపులు తప్పలేదు.

పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకోవాలి. నైనాకే కాకుండా… నైనా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా మెసేజ్ లు చేస్తున్నాడు యువకుడు. పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి… కఠిన చర్యలు తీసుకోవాలి. నైనా సోషల్ మీడియా అకౌంట్స్ వ్యక్తిగతంగా నేనే హ్యాండిల్ చేస్తాను. ఒకటిరెండు సార్లు హెచ్చరించాను… అయినా మెసేజ్ లు చేస్తూనే ఉన్నాడు యువకుడు. అందుకే ఫిర్యాదు చేసాను. నైనా మాదిరిగా… ఇంకా ఎంతమందిని వేధిస్తున్నాడో పోలీసులు కనిపెట్టాలి. యువకుడిని శిక్షించాలి అని ఆయన అశ్విన్ జైస్వాల్ డిమాండ్‌ చేశారు.

Exit mobile version