Site icon NTV Telugu

Nagoba Jatara : ఫిబ్రవరి 9న నాగోబా మహపూజ.

ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు మొదలైంది. ఆదిలాబాద్ కేస్లాపూర్‌లో నాగోబా జాతర తేదీలను నిర్ణయించారు మేస్త్రం వంశీయులు. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 9 నుండి మొదలయ్యే కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమై పాదరక్షలు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి బయలుదేరారు.

సుమారు 250 మంది ఆదివాసి మెస్రం వంశస్థులు 125 కిలోమీటర్ల వరకు వివిధ గ్రామాలకు ఉన్న పాదయాత్ర నిర్వహించి గోదావరి నది నుండి గంగా జలాలను సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్ర గంగా జలాలను కళాశాల ద్వారా తీసుకువచ్చి తమ ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ లోని నాగోబాకు అభిషేకించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు కాలినడక ద్వారా గంగా జలాలను తీసుకువచ్చి కిస్లాపూర్ లోని సాంప్రదాయ మర్రిచెట్టుకు కలశాలు కట్టి ఆలయ పూజారి సూచన మేరకు నాగోబాకు అభిషేకించన్నారు. ఆదివారం నాడు మెస్రం వంశస్తులంతా హాజరై మహా పాదయాత్రకు వెళ్లే మార్గం గురించి, ఎక్కడెక్కడ బస చేయాలి అన్న అంశాలపై రూట్ మ్యాప్ రూపొందించుకున్నారు. ఆదివారం రాత్రి ఆచారం ప్రకారం మెస్రం వంశస్తులంతా ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడలో బస చేసి మరుసటి రోజు నుండి పాదయాత్ర హస్తినమడుగు వరకు కొనసాగనుంది.

Exit mobile version