Hara Hara Mahadev: నాగార్జున ఆవిష్కరించిన మూవీ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hara Hara Mahadev: జీ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ‘హర హర మహాదేవ్’ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో సుబోధ్ భావే, బాజీ ప్రభు దేశ్‌పాండే పాత్రలో శరద్ కేల్కర్ నటించిన ఈ ‘హర హర మహాదేవ్’ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరాఠిలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో, ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, “జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నా చిన్నతనం నుంచీ ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి ఎన్నెన్నో వింటూనే ఉన్నాను. ఆయన ఎంత గొప్ప రాజు.. ఎలా పరిపాలించాడు.. అనేవి వింటూనే పెరిగాను. ఈ కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన కథనే కాకుండా, శివాజీ మహరాజ్ స్నేహితుడైన బాజీ ప్రభు దేశ్‌పాండే కథను కూడా చూపించబోతున్నారు. లక్షాయాభై వేల సైన్యాన్ని కేవలం 300 యోధులతో ఎలా ఎదుర్కొన్నారో ఇందులో చూపించబోతున్నారు. నేను ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సినిమాల పరంగా భారతదేశం అంతా ఒక్కటే అయింది. చాలా చిన్నగా అనిపిస్తోంది. భాషాబేధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను విజయవంతం చేస్తున్నారు” అని అన్నారు. ‘హర హర మహాదేవ్’ చిత్రానికి అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించారు. సుబోధ్ భావే, శరద్ కేల్కర్, అమృతా కాన్విల్కర్, సయాలీ సంజీవ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!