NTV Telugu Site icon

Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..

Manam (1)

Manam (1)

Manam Re-Release : అక్కినేని ఫ్యామిలీకి “మనం”సినిమా ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.ఈ సినిమాలోఅక్కినేని మూడు తరాల వారు అయిన నాగేశ్వరరావు  ,నాగార్జున ,నాగ చైతన్య ,అఖిల్ కలిసి నటించారు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే మే 23 2014 న ఈ మూవీ రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

Read Also : Kalki 2898 AD : అదిరిపోయే ఎంట్రీకి సిద్ధం అవుతున్న బుజ్జి..ఈవెంట్ విజువల్స్ వైరల్..

ఇప్పటికే ఈ క్లాసిక్ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు భారీగా టికెట్స్ బుక్ చేసుకున్నారు.ఈ సందర్భంగా  అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ వీడియో ను షేర్ చేసుకున్నారు.మనం సినిమా మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని నాగార్జున తెలిపారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో నాన్న గారికి బాగోలేకపోయిన సెట్స్ లో మా అందరిని నవ్విస్తూ షూటింగ్ పూర్తి చేసారు.కానీ నాకు ఒక్కటే భాధ నాన్న గారికి ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూపించలేక పోయాను.ఆయన ఎక్కడున్నా కూడా ఈ సినిమాకు మీరు చూపించిన ఆదరణ చూసి ఎంతో సంతోషించి వుంటారు.ఈ సినిమాను మళ్ళీ మీ ముందుకు తీసుకు రావడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు.

Show comments