Nagarjuna: టాలీవుడ్ మన్మధుడిగా, గ్రీకువీరుడిగా, కింగ్‌గా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అక్కినేని నాగార్జున. రోజు రోజుకి ఆయన వయసు పెరుగుతున్న అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికి నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తూ, యువ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను వెల్లడించారు. ఇంతకీ టాలీవుడ్ మన్మధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Stress Management Tips: మీరు ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నేను ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటాను. అలాగే నేను ఎప్పుడూ కడుపు మాడ్చుకొని డైటింగ్ చేయలేదు. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా నన్ను నేను నిరుత్సాహపరుచుకోను. టైంకి తింటాను. కచ్చితంగా రోజూ మార్నింగ్ వ్యాయామం చేస్తాను. ఏ రోజూ కూడా జిమ్ మిస్ అవలేదు. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక.. వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగతా రోజుల్లో కచ్చితంగా జిమ్‌కు వెళ్తా. నేను ఇప్పటికి 45 ఏళ్లుగా జిమ్ చేస్తున్నాను’’ అని చెప్పారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో 2025 గురించి ఆయన మాట్లాడుతూ.. కెరీర్, పర్సనల్ లైఫ్‌లో భాగంగా తాను ఈ ఏడాది ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఇంతకుమించి తానేం కోరుకోవడం లేదన్నారు.
READ ALSO: Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మృత్యు ప్రయాణం.. పలువురు మృతి
