Kubera: ‘కుబేర’ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్..

Kubera

Kubera

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’ ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది.

Also read: T20 World Cup 2024: రింకూ సింగ్‌ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్..

వర్షంలో తడుస్తున్న నాగార్జున గొడుగు పట్టుకుని ఉండగా వర్షంలో తడిసి ముద్దయిన ఐదు వందల నోటు కనిపిస్తుంది. దాంతో అందరూ నాగార్జున డబ్బులు తీసుకుంటారని భావిస్తారు. కాకపోతే., నాగ్ తన జేబులో నుండి ఓ 500 రూపాయల కాగితాన్ని తీసి ఒకచోట ఉంచాడు. ఈ సన్నివేశంతో నాగార్జున సినిమాలో కథ పట్ల ఆసక్తిని రేకెత్తించింది.
Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..

ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోల్ క్రియేషన్స్ బ్యానర్‌ పై చిత్రాన్ని నిర్మిస్తుండగా., దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.