Site icon NTV Telugu

Nagarjuna: ‘ధురంధర్‌’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!

Nagarjuna

Nagarjuna

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమా ‘#King100’పై దృష్టి సారించారు. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. నాగ్ కేవలం హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లోనూ అలరిస్తు్న్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమాలో ఆయన విలన్‌గా అదరగొట్టారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. ‘ధురంధర్‌’ రెహమాన్‌ డెకాయిత్‌ పాత్రలో నాగ్ కనిపించాల్సిందని, ఆయన ఈ పాత్రను వదులుకున్నారంటూ తెగ ప్రచారం అవుతుంది. దీనిపై తాజాగా నాగ్ స్పందించారు.

READ ALSO: Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనకు ఎవరూ ఏ పాత్ర చేయమని అడగలేదని చెప్పారు. ఇదే క్రమంలో ఆయన ‘ధురంధర్‌’ మూవీ గురించి మాట్లాడుతూ..‘ధురంధర్‌’లో అక్షయ్‌ఖన్నా యాక్టింగ్ సినిమాకే హైలైట్‌‌గా ఉంటుందని, ఓవరాల్‌గా ఈ సినిమా సూపర్‌‌గా ఉందని అన్నారు. ఆదిత్యధర్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిద్దారని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఉరి’ సినిమా కూడా తనకు ఇష్టమే అని అన్నారు. ఈ మూవీ సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్‌ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ధురంధర్‌2 మార్చి 19న మూవీ హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది.

READ ALSO: Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్ యూ.. జైలు గోడల మధ్య నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ ‘ఖరీదైన’ ప్రేమ లేఖ!

Exit mobile version