NTV Telugu Site icon

Nagari YSRCP: హాట్‌ టాపిక్‌గా మారిన ‘నగరి’ అసమ్మతి నేతల వ్యవహారం.. సీఎంవో నుంచి వెనక్కి..!

Nagari

Nagari

Nagari YSRCP: చిత్తూరు జిల్లాలో నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి.. ఇప్పటికే మంత్రి రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం.. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి.. విమర్శలు చేశారు.. గత ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత రోజా ఎలా మారిపోయారే వారు వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. అయితే, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నగరి అసమ్మతి నేతల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఏకంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికే షాక్‌ ఇచ్చేలా అసమ్మతి నేతల వ్యవహారం ఉందంటున్నారు.

Read Also: IPL 2024: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్!

అయితే, సీఎంవో నుంచి పిలుపుతో నగరి నుంచి తాడేపల్లి వెళ్లారు మంత్రి ఆర్కే రోజా అసమ్మతి నేతలు.. అక్కడ రోజంతా పడిగాపులు కాశారట.. కానీ, చివరికి రేపు రావాలని.. మంత్రి రోజా సమక్షంలో మాట్లాడదామని చెప్పారట.. దీంతో.. రోజంతా పడిగాపులు కాసిఉన్న అసమ్మతి నేతలు.. ఆగ్రహంతో వెనక్కి వెళ్లిపోయారట.. వారిలో.. శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, మురళధర్ రెడ్డి, లక్ష్మీపతి రాజు, అమ్ములు.. ఇతర ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు ఉన్నారట.. అధిష్ఠాన మీదా గౌరవంతో వస్తే.. మళ్లీ మంత్రి రోజాను కూర్చోబెట్టి మాట్లాడిస్తామని చెబుతారా..? అని మండిపడుతున్నారట.. ఇప్పటి వరకు రోజా వద్దు.. జగన్‌ ముద్దు అంటూ వచ్చిన నేతలు.. ఇప్పుడు మాకు రోజా వద్దు.. మీరు వద్దు అంటూ సీఎంవో నుంచి నగరికి వెళ్లిపోయారట.. అయితే, ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది.. మరోవైపు.. అధిష్ఠానం మాటలు లెక్కచేయకపోవడంతో చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.